05-12-2024 12:08:47 PM
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం కానుంది. ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌజ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వనున్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది సర్కార్. గ్రామసభలో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది.