calender_icon.png 14 September, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ రావును అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

05-12-2024 11:53:03 AM

హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో గురువారం ఊరట లభించింది. హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు విషయంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని ధర్మాసనం తెలిపింది. పోలీసుల దర్యాప్తుకు హరీశ్ రావు సహకరించాలని కోర్టు తెలిపింది. హరీశ్ రావుపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.