09-08-2025 12:47:16 AM
కొత్తకోట ఆగస్టు 8 : బీహార్ లో ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ కొత్తకోట మం డల కేంద్రంలో చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆ ధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ మాట్లాడుతూ బీహార్ రాష్ట్రం లో జరగబోతున్న ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను ఎన్నికల కమిషన్ తో తొ లగించి అక్రమ పద్ధతిలో అధికారంలోకి రా వాలని బిజెపి కుట్ర పన్నుతుందని దాదాపు 64 లక్షల ఓట్లను తొలగించిందని ఇందులోఅత్యధికంగా మైనార్టీలు మాత్రమే ఓటర్లుగా ఉన్నారని ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లే ఉన్నాయని అన్నారు.
మైనార్టీలు ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లు బిజెపికి వ్యతిరేకంగా ఓట్లేస్తారని భావించి ఓట్లను తొ లగించిందని ఆరోపించారు. ఎస్సీ నియోజకవర్గంలో 40 నుండి 60% తీసివేసిందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అండతండాలతో బిజెపి ఆ రాష్ట్రంలో అధికారంలో రావాలని కుట్ర ప న్నుతుందని విమర్శించారు. తెలంగాణ రా ష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం తీసుకురావాలని 9వ షె డ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మైనార్టీలు పొందకూడదని అక్రమ పద్ధతిలో కేంద్ర ప్ర భుత్వం బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగులుతుందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్ యూపీ మరియు ఇతర రాష్ట్రాల్లో మైనార్టీలు బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణలో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ముస్లింలలో దూదేకుల తదితర అట్టడుగు తరగతుల వా రు ఉన్నారని వెనుకబడిన వారు కాబట్టే వా రికి రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను అమలు జరిగేలా కేం ద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కాద న విషయాన్ని మండల కమిషన్ తెలియజేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయ కులు కే వెంకటయ్య, కురుమన్న, యాద య్య, బాబులు, రమేష్, బాలస్వామి, నెల్లూ రి కురుమన్న, భాస్కరు, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.