09-08-2025 12:47:57 AM
మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
భీమదేవరపల్లి ఆగస్టు 8 (విజయ క్రాంతి): ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన తాను నిత్యం తోడు ఉంటానని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హామీ ఇచ్చారు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింద హుస్నాబాద్ లోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనమాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ మాట్లాడుతూరానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ విజయం దిశగా అందరు పని చేయాలన్నారు. గ్రామ గ్రామానా గులాబీ జెండా ఎగరవేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు.
ఈ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక మొత్తం ఫెయిల్ అయిందన్నారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకి తీసుకెళ్లి వారికీ నిజాలు తెలియజేసే బాధ్యత ప్రతీ ఒక్కరు విజ్ఞప్తి చేశారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుంది అన్నారు. రైతులకు సాగునీరు అందించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది మన కేసీఆర్ అయితే కనీసం రైతులకు సాగునీరు అందియ్యక పంట పోలాలు ఎండీ పోతున్న పంటించూకోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈకార్యక్రమంలో ఎల్కతుర్తి మండల ముఖ్య నాయకులు .మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు ,మాజీ ఎంపీ టిసిలు, మాజీ వార్డ్ నెంబర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.