09-08-2025 12:44:43 AM
శ్రీరంగాపురం, ఆగస్టు 08 : మండల కేంద్రంలోని సర్వ వర్గ సామూ హిక భవనంలో శుక్రవారం జర్నలిస్టుల వనపర్తి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా ఇటీవల మరణించిన జర్నలిస్టు మిత్రుడు తోక సురేష్ కు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా టీయూడబ్ల్యూజే ఐజే యు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్, జిల్లా అధ్యక్షుడు మాధవరావు, నియోజకవర్గ అధ్యక్షుడు విజ య్ లు మాట్లాడుతూ.. జర్నలిస్టుల కుటుంబాలకు వైద్యం విషయం లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా రాష్ట్ర నాయకత్వం ఎల్లపుడు అందుబాటులో ఉంటుందన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనే యూనియన్ కులాలకు మతాలకు పని చేయదని జర్నలిస్టుల అభివృద్ధి కోసం పని చేయడం జరుగుతుందన్నారు.
మండలంలోని ప్రతి జర్నలి స్టులందరూ కలిసి మెలిసి యూనియన్ బలోపేతం చేయడంతో పాటు వారికి కావాల్సిన హక్కులను సాధించుకుంటునందుకు చాలా సంతోషకరమైన విషయమని, సెప్టెంబర్ మొదటి వారం 6, 7 వ తేదీలలో జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలను కూడా శ్రీరంగాపురం మండల కేంద్రంలోనే నిర్వహించడం జరుగుతుందన్నారు..
ఈ కార్యక్రమంలో భాగంగా టీయూడబ్ల్యూజే ఐజెయూ రాష్ట్ర కార్యదర్శి మదుగౌడ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మాధవరరావు, నియోజకవర్గ అధ్యక్షులు విజయ్, హౌసింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు చీర్ల శివసాగర్, పరుశరాముడు, ప్రధాన కార్యదర్శి బాలరాజు, మన్యం, మండల అధ్యక్షుడు రంగస్వామి నాయుడు, గుంటి వేణుగోపాల్, నరేష్ గౌడ్, బాలరాజు నియోజకవర్గంలోని వివిధ మండలాల విలేకరులు పాల్గొన్నారు.