calender_icon.png 9 August, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బ్యాగులు, పెన్నులు, నోట్‌పుస్తకాలు పంపిణీ

09-08-2025 12:45:49 AM

గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 400 మంది పేద విద్యార్థులకు సహాయం

 వెంకటాపురం నూగూరు, ఆగస్ట్ 8( విజయ క్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం  మండలలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం ఆధ్వర్యంలో వెంకటాపురం  మండలలలోని బర్లగూడెం, ఒంటిమామిడి, మైతాపురం, నూగూరు, రాసపల్లి , తిప్పాపురం, కలిపాక , కొత్తగుంపు, సూరవీడు కొత్తకాలనీ, సూరవీడు, అంకన్నగూడెం, నాయకులగూడెం గ్రామాలలోనీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 400 మంది  నిరు పేద విద్యార్ధిని, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పెన్నులు, నోట్ పుస్తకాలు ,  పలకలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులగూడెం ప్రధానోపాధ్యాయులు  పి సూర్య నారాయణ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు విద్యా సామాగ్రి  పంపిణీ చేయడం చాలా సంతోషకరమని, ఇటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు .

మారుమూల గిరిజన గ్రామాలలో పేద పిల్లలకు సహాయం చేయడానికి ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం చాలా అభినందనీయమనీ, సంస్థ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సిబ్బంది,  జి.యస్.యస్ ప్రతినిధులు  ముర్రం రాజేష్, కంతి ముత్తయ్య,  ఉపాధ్యాయురాలు  కారం ఇందిరా పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.