09-01-2026 03:47:54 PM
సుజెన్ మెడికేర్.. నిరుద్యోగ యువకు ఉపాధి.
పెద్ద కంపెనీలకు సీఈఓలు.. మనదేశం వాళ్లే.
నీళ్ల పంచాయితీపై స్పందించిన సీఎం రేవంత్.
కోర్టుల ముందు కాదు.. కూర్చొని మాట్లాడుకుందాం.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికకేర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సుజెన్ మెడికేర్.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయని సూచించారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని తెలిపారు. ప్రపంచస్థాయి దేశాలతో తెలంగాణ పోటీపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం మనరాష్ట్రంలో ఉందని చెప్పారు. పెట్టుబడి దారులకు విశ్వాసం కల్పించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించిందని వెల్లడించారు. పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్నది.. మన దేశంవాల్లే అన్నారు.
తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయతీపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ''పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా.. అని నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతా... వివాదాలు కావాలా పరిష్కారం కావాలా.. అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతా'' అని సీఎం స్పష్టం చేశారు. నీళ్ల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తలేదని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదని తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీళ్ల విషయంలోరాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన చేయవద్దని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించి సమస్య పరిష్కరించుకోవాలని కోరారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులకు అభ్యతరం చెప్పొద్దని కోరారు. ఉమ్మడి ఏపీలోనే ప్రతిపాదన జరిగిందని సూచించారు. ఏపీకి సమస్య ఉంటే సహకరిస్తామని తెలిపారు. కోర్టుల ముందు కాదు.. మనమే కూర్చుని మాట్లాడుకుందామని ఏపీ సీఎం చంద్రబాబును రేవంత్ కోరారు.