calender_icon.png 10 January, 2026 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బానయ్య కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

09-01-2026 03:48:00 PM

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్

రెబ్బెన,(విజయక్రాంతి): మండలంలోని గోలేటి గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న చిర్ర బానయ్య విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా మరణించారు. ఈ సంఘటనపై గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్  తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన బానయ్య  కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.

అలాగే, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి రత్నం దేవాజీ, జిల్లా నాయకులు సుధాకర్, బాబాజీ, సిబ్బంది భీమయ్య, బాలయ్య, లక్ష్మీ, ఎల్లమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.