05-11-2025 12:38:28 AM
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): జూబ్లిహిల్స్ ఎన్నికల అనంతరం సీఎం రేవంత్‌రె డ్డికి పదవీ గండం స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. అందుకే రేవంత్ సన్నిహితులు ఆయనకి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. రేవంత్ కి పదవీ గండం ఉందని గల్లీ నుంచి ఢిల్లీ దాకా గుస గుసలు వినిపిస్తున్నాయని చెప్పారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లా డుతూ.. ఎక్కడికి వెళ్లినా డ్రైనే జ్ ఓవర్ ఫ్లో, మురికి వాసన, గుంతల రోడ్లు జూబ్లీహిల్స్ లో ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ ఓటర్లను భయపెడుతున్నారని, మరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అజారుద్దీన్ మంత్రి అవ్వడం రేవంత్‌కు ఇష్టం లేదని చెప్పారు.