calender_icon.png 5 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాధవానంద స్వామి ఆశ్రమ ఏర్పాట్లు పూర్తి చేయాలి

05-11-2025 12:37:07 AM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, నవంబర్ 4 :సంగారెడ్డి రాంనగర్ రామ్ మందిరంలో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి ఆశ్రమ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాధవానంద స్వా మిని కలిసి ఆశ్రమ ఏర్పాట్లపై చర్చించారు. రామమందిర్ లో మాధవ నంద స్వామి భక్తులతో సత్సంగ్ చేసే ందుకు, భక్తులను కలిసేందుకు వీలు గా తగిన ఏర్పాట్లు చేయాలని రామ్ నగర్ భజన మండలికి జగ్గారెడ్డి సూచించారు.

ఆలయంలో ఆశ్రమం నీటి అవసరాలు తీర్చేలా తక్షణమే బోర్ వేయించి నీటి ట్యాంక్ ఏర్పాటు చేయాలని తెలిపారు.. అనంతరం శ్రీ మాదవానంద స్వామితో కల్సి రామ్ మందిర్ లో ఆశ్రమ పరిసరాలను పరిశీలించి భజన మండలి సభ్యులకు సూచనలు చేశారు. ఆశ్రమంలో నిర్వహించే పూజ కార్యక్రమాలకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.