29-08-2025 01:38:52 AM
జనగామ, ఆగస్టు 28 (విజయక్రాంతి): జనగామ నుండి హుస్నాబాద్ కు వెళ్లే రహదారిలో గానుగుపాడు బ్రిడ్జి వద్ద అదుపు తప్పి లారీ బోల్తా కొట్టింది. మహారాష్ట్ర నుంచి ముడి ఇనుముతో ఏపీ కి వెళ్తున్న ఓ లారీ గురువారం జనగామ జిల్లా గానుగుపహాడ్ బ్రిడ్జి వద్ద మట్టి రోడ్డు కుంగడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. డ్రైవరు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బ్రిడ్జి నిర్మాణం జాప్యం చేస్తుండడంతో, తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలి వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.