21-07-2024 10:35:43 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం అయింది. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 8గంటలకు మహంకాళి అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.అధికారులు శివసత్తులకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. రేపు రంగం భవిష్యవాణి, అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియనుంది. నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.