31-10-2025 01:13:56 AM
 
							* రేపు హుస్నాబాద్, వరంగల్ జిల్లాల్లో ఏరియల్ సర్వే
సిద్దిపేట కలెక్టరేట్,అక్టోబర్:30 రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో మొంథా తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదై పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. వేల టన్నుల వరి ధాన్యం తడిసి పోయిందని, కొంత వరి కొట్టుకుపోయిందని చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శుక్రవారం హుస్నాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేస్తానని హామీ ఇచ్చారు.
‘కలెక్టర్ హైమావతి సూచనలు
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమతి లేకుండా ఎవరూ సెలవుపై వెళ్లరాదని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాల యంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాలకు సంబంధించిన సమాచారానికి 08457-230000 నంబర్ ద్వారా తెలియజేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు, వాగులు, కాజ్వేల వద్ద బారికేడ్లు ఏర్పాటు చే యాలని కలెక్టర్ సూచించారు.శాఖల మధ్య సమన్వయం కుదించుకుని సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లిలో దెబ్బతిన్న త్రాగునీటి పై ప్లైన్ను వెంటనే పునరుద్ధరించాలని, వరి కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్ కవర్లు అందించాలని అధికారులను ఆదేశించారు.