calender_icon.png 22 January, 2026 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కళ్లలో రక్తం చూస్తున్న సీఎం!

23-09-2024 01:56:52 AM

బీఆర్‌ఎస్ నేత దాసోజ్

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి తన నిరంకుశత్వ, కురచ మనసత్వంతో నిస్సహాయులైన ప్రజల కళ్లలో రక్తం చూస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు దాసోజ్ శ్రవణ్‌కుమార్ విమర్శించా రు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ కష్టాలను తీర్చమని ప్రజ లు అధికారమిస్తే.. వారితోనే కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వ వైఖరి ముమ్మాటీకి రాక్షసత్వమేనని మండిపడ్డారు. అనేక మంది నాయకులు తమ అధికారం, ప్రాబల్యం కోసం ముఖ్యమం త్రి చేతిలో  కీలుబొమ్మలుగా మారార ని, ప్రజా వ్యతిరేక విధ్వంసకర చర్యల కు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.