12-07-2025 12:21:40 AM
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్
నిర్మల్ జులై 11 (విజయక్రాంతి): సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్) డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాల ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ల తో ఆయన సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మా ట్లాడుతూ, రాష్ర్ట ప్రభుత్వం 2023- సంవత్సరానికి గాను సన్నరకం వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించినట్లు చెప్పారు.
జిల్లాలో మొత్తం 32,200 టన్నుల సన్న వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి జూలై 27లోపు ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. గడువు ముగిసేలోపు ధాన్నాన్ని అందించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సుధాకర్, అధికారులు, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.