calender_icon.png 12 July, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత

12-07-2025 12:22:57 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 11 ( విజయక్రాంతి):  రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో దివ్యాంగురాలు దుర్గం సుగుణ  అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన విషయం తెలుసుకున్న కనకదుర్గ దేవి, స్వయంభూ మహంకాళీ దేవస్థాన ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి అంతక్రియల నిమిత్తం  ఐదువేల రూపాయల నగదు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

దీనితో పాటు వారికి కావలసిన నిత్యవసర సరుకులు, భోజన వసతిని కల్పించి ఆపదలో ఉన్న వారి కి ఆపన్నా హస్తం  అందించాడు. కార్యక్రమం లో దేవస్థాన అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్, దుర్గం తిరుపతి గ్రామస్తులు ఉన్నారు.