12-07-2025 12:20:56 AM
సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించిన జెన్కో సీఎండీ
నాగార్జునసాగర్, జూలై 11: నాగార్జునసాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎండీ హరీశ్, తెలంగాణ రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి నవీన్ మిట్టల్, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించి పరిశీలించిన అనంతరం నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ స్వాగతం పలికారు.
అనంతరం విజయ విహార్ నుంచి సాగర్ జలాశయ అందాలను తిలకించారు. విజయ విహార్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. పైలాన్ కాలనీలోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మరమ్మతులు నిర్వహిస్తున్న మొదటి టర్బైన్ పనులను పరిశీలించారు.
విద్యుత్ కేంద్రం అంతర్భాగంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి పక్రియను పరిశీలించిన అనంతరం కంట్రోల్ రూమ్ చేరుకొని అక్కడ విద్యుత్ అధికారులతో విద్యుత్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు వీరివెంట హైడల్ డైరెక్టర్ బాలరాజు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్, ఎస్‌ఈ రఘురాం సాగర్, సీఐ శ్రీను నాయక్, జెన్కో సీఐ నాయుడు, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్‌రెడ్డి, సాగర్ ఎస్సై ముత్తయ్య ఉన్నారు.