calender_icon.png 23 August, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారీశక్తికి ప్రాధాన్యం ఇస్తున్న మోదీ

23-08-2025 12:44:05 AM

- చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్

- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వండి

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

చేవెళ్ల, ఆగస్టు 22:ప్రధాని నరేంద్ర మోదీ నారీ శక్తికి ప్రాధాన్యం ఇస్తున్నారని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద ర్ రావు స్పష్టం చేశారు. మహిళలు బాగుం టే దేశం బాగుందనే ఉద్దేశంతో షెడ్యూల్ తె గకు చెందిన మహిళను రాష్ట్రపతిగా, మరో మహిళను ఆర్థిక మంత్రిగా నియమించిన ఘనత మోదీదని కొనియాడారు. పల్లెపల్లె బీజేపీలో భాగంగా శుక్రవారం చేవెళ్ల మండ లం ఆలూరులో నిర్వహించిన మహిళా స మ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, తులం బంగారం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు బంధు లాంటి పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చినా.. గ తంలో నాలుగు సార్లు వచ్చే బస్సులు ఇప్పు డు ఒక్కసారి మాత్రమే వస్తున్నాయని మహిళలే ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు. 

మహిళా సాధికారతకు కృషి

ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేస్తున్నారని, 5 కిలోల రేషన్ బియ్యం, ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్, ముద్రా లోన్లు, స్టాండప్ ఇండి యా, స్టార్టప్ ఇండియా కింద రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ష్యూరిటీ లేకుండా మహిళలకు రుణాలు ఇస్తున్నారని వెల్లడించారు. జన్ ధన్ యోజన కింద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడమే కాదు నెలకు ఒక రూపాయి చెల్లిస్తే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నారన్నారు. సుకన్య సమృద్ధి యోజన, బేటీ పడావో.. బేటీ బచా వో లాంటి పథకాలంతో ఆర్థికం, విద్య పరం గా సపోర్టు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్లకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, తెలంగాణలో మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఖానాపూర్ గ్రామంలో పత్తి పంటను పరిశీలించి.. రైతులను ఎదుర్కుంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. 

యూరియా, విత్తనాలు, ఎరువుల అందుబాటు గురించి తెలుసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకోసం చేస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న పథకాలను గురించి వివరించారు.  ఈ కార్యక్ర మాల్లో బీజేపీ జిల్లా రాజ్ భూపాల్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గుండన్నగారి వెంకట్ రెడ్డి, చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు మున్నూరు శ్రీకాంత్, నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, గౌం డ్ల కృష్ణ గౌడ్, పత్తి సత్యనారాయణ, ఇంద్రసేనా రెడ్డి, అశోక్, జయసింహ, మల్లారెడ్డి గణేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.