calender_icon.png 23 August, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న పాఠశాల

23-08-2025 12:42:21 AM

మూడేళ్ల నుండి పిల్లర్ల కే పరిమితమైన నూతన భవన నిర్మాణం.. 

తాండూరు, 22 ఆగస్టు, (విజయక్రాంతి )పెద్దముల్ మండలం ఎర్రగడ్డ తండాలో ప్రాథమిక పాఠశాల గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతోంది. ఐదు తరగతులకు గాను 43 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒకే ఒక్క టీచర్ విద్యా బోధన కొనసాగిస్తున్నారు.గత మూడేళ్ల క్రితం నూతన పాఠశాల భవనం కోసం పాత పాఠశాలను కూల్చివేసి కమ్యూనిటీ భవనంలో ఇదివరకు కొనసాగింది.ఆ భవనం కూడా శిథిలావస్థకు చేరింది. ఇటీవలే గ్రామంలో భారీ పేలుళ్ల శబ్దాలు రావడంతో ఊరు ఊరంతా దద్దరిల్లింది .

ఎప్పుడు కులుతుందో..ఎప్పుడు ఏ ప్రమాదం ముంచికోస్తుందో.. అని ఇటీవలే గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి పాఠశాలను మార్చారు. ఒకే గదిలో ఐదు తరగతులకు పాఠాలు జరుగుతుండడంతో విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. త్రాగునీరు లేకపోవడంతో చిన్నారులు బాటిల్లో ఇంటి నుండి తీసుకు వెళ్తున్నారు.. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.ఈ విషయమై మండల విద్యాధికారి నర్సింగరావును వివరణ కోరగా గత ప్రభుత్వ హయాంలో నూతన పాఠశాల భవనం మంజూరు అయ్యిందని కాంట్రాక్టర్కు బిల్లులు అందకపోవడంతో పిల్లర్లకే పరిమితమైందన్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించామని ... ఐదు తరగతులకు గాను మరో టీచర్ను త్వరలోనే నియమిస్తామనితెలిపారు.