12-08-2025 12:13:18 AM
నిజామాబాద్ ఆగస్టు 11 (విజయక్రాంతి) : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 121 మందికి 35,62,000 రూపాల విలువ గల చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.