calender_icon.png 31 August, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన పంటల పరిశీలన

30-08-2025 06:28:12 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు వేసిన పంటలు నీట మునిగి కొట్టుకుపోయాయి. మండలంలో 3924 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజాప్రతి తెలిపారు. శనివారం మండలంలోని తిమ్మాజివాడి, తుక్కోజీవాడి గ్రామాల్లో నీట మునిగి నష్ట పోయిన పంటలను పరిశీలించారు. మండలంలో పత్తి  1028, మొక్కజొన్న 1454, వరి 1125, సోయా 317 ఎకరాల్లో పంట నీట మునిగినట్టు తెలిపారు. 2754 మంది రైతులకు పంట నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ప్రభుత్వనికి నివేదిక అందజేయడం జరుగుతుందని తెలిపారు.