calender_icon.png 12 July, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ప్రాజెక్టుకు జీఆర్‌ఎంబీ అభ్యంతరం

12-07-2025 12:26:31 AM

  1. కేంద్ర జల సంఘానికి లేఖ
  2. ప్రాజెక్టు అమలులో సమస్యలున్నాయని స్పష్టీకరణ
  3. ఏపీ ప్రతిపాదనపై ఏడు కీలక అభ్యంతరాలు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య వివాదానికి కారణమైన బనకచర్ల ప్రాజెక్టుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు శనివారం కేంద్ర జల సంఘానికి లేఖ రాసిం ది. పోలవరం నుంచి అదనంగా 200 టీఎంసీల వరద నీటిని బనకచర్లకు తరలిం చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికపై జీఆర్‌ఎంబీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

బనకచర్ల ప్రా జెక్ట్ అమలులో చట్టపరమైన, అంతర్రాష్ట ఒప్పందాల సమస్యలు చాలా ఉన్నాయని లేఖ ద్వారా స్పస్టం చేసింది. పోలవరం డ్యా మ్ నిల్వ నుంచి రోజుకు 2 టీఎంసీల చొ ప్పున, మొత్తం 200 టీఎంసీల వరద నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన పీఎఫ్‌ఆర్‌ను పరిశీలించిన జీఆర్‌ఎంబీ, ఈ ప్రతిపా దన అమలు అంత సులభం కాదని తేల్చిచెబుతూ ౭ ప్రధాన అంశాలను లేవనెత్తింది.

జీఆర్‌ఎంబీ అభ్యంతరాలు..

2009లో ఆమోదం పొందిన పోలవరం ప్రాజెక్టుకు అదనంగా 200 టీఎంసీల నీటిని తరలించడం అనేది ప్రాజెక్టు పరిధిని పూ ర్తిగా మార్చేస్తుంది. కాబట్టి సవరించిన సమ గ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి తిరిగి జలవనరుల శాఖ సలహా కమిటీ ఆమోదం పొందాల్సిందేనని జీఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తే పోలవరం డ్యామ్ ఆపరేషన్ షెడ్యూల్‌లో మార్పులు వస్తాయి.

ఇది 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల మధ్య కుదిరిన గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ఒప్పందానికి విరుద్ధం. ఆపరేషన్ షెడ్యూల్‌లో ఏ మార్పు చేయాలన్నా, వారసత్వ రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాలను సంప్రదించడం తప్పనిసరని గుర్తుచేసింది. అదేవిధంగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల కంటే ఎక్కువగా మళ్లిస్తే, ఆ అదనపు జలాలను బచావత్ ట్రిబ్యూనల్ ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ర్ట పంచుకోవాల్సి ఉంటుంది.

ఈ నిబంధనను సీడ బ్ల్యూసీ పరిగణనలోకి తీసుకోవాలని సూ చించింది. గోదావరి బేసిన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు లభించిన నీటి వాటాను విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల మధ్య ఏ ట్రిబ్యునల్ కేటాయించలేదు. ఇరు రాష్ట్రాల మధ్య దీనిపై ఎటువంటి ఒ ప్పందం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ఏకపక్షంగా ఇంత భారీ నీటిని తరలించడం వివా దాలకు దారితీస్తుందని, ఈ కీలక విషయా న్ని సీడబ్ల్యూసీ గమనించాలని జీఆర్‌ఎంబీ పేర్కొంది.

ప్రతిపాదిత ప్రాజెక్టుకు ఉపయోగించేది మిగులు జలాలా లేక వరద జలాలా అనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొ త్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించేందుకు అవసరమైన మౌలిక సదుపా యాల కల్పన ఖర్చును పీఎఫ్‌ఆర్‌లో చేర్చలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌లో అన్ని భాగాల ఖర్చును చేర్చాలని జీఆర్‌ఎంబీ ఆదేశించిం ది. ఈ కొత్త ప్రాజెక్టు వల్ల ఏపీ, తెలంగాణ రా ష్ట్రాలలో ఇప్పటికే ఉన్న, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల నీటి వినియోగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీడబ్ల్యూసీ నిర్ధారించుకోవాలని కోరింది.