calender_icon.png 13 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా డే పరేడ్‌లో కోగ్రాండ్ మార్షల్స్‌గా

13-08-2025 12:55:24 AM

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే 43వ వార్షిక ఇండియా డే పరేడ్ వేడుకల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సందడి చేయను న్నారు. ఈ పరేడ్‌కు వీళ్లిద్దరూ కో-గ్రాండ్ మార్షల్స్‌గా వ్యవహరించనున్నారు. ఆగస్టు 17న న్యూయార్క్  మాడిసన్ అవెన్యూ  వేదికగా ‘సర్వే భవంతు సుఖినః’ అనే థీమ్‌తో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని కోరుతూ ఈ థీమ్‌ను ఎంచుకున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఏ) అధ్య క్షుడు సౌరిన్ పారిఖ్ తెలిపారు.

విదేశాల్లో భారత్ ప్రతిష్టను పెంపొందించేందుకు ఈ పరేడ్ వేడు కలను నిర్వహిస్తారు. 1981లో ఒక చిన్న పరేడ్‌గా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే వేడుకగా పేరుగాంచింది.  1970లో స్థాపితమైన ఎఫ్‌ఐఏ భారతీయ సంస్కృతిని విస్తరించటంతోపాటు అమెరికా- సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎఫ్‌ఐఏ ఈ ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలు కార్యక్రమాలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్.. ఆరు భాషల్లో ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు. ఈ సందేశం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.