calender_icon.png 11 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిర్యానీలో బొద్దింక

11-09-2025 01:25:14 AM

హోటల్ యజమానిని ప్రశ్నిస్తే  దబాయింపులు

ముషీరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): బిర్యానీ ప్రియులు హోటల్లో తినే ముందు జాగ్రత్త.. కాస్త ఆలోచించి తినండి.. ఈ మధ్యకాలంలో హోటల్ లలో బొద్దింకలు, బల్లులు, టాబ్లెట్లు, రావడం సర్వసాధా రణమైపోయింది. ఇలాంటి సంఘటననే ముషీరాబాద్‌లో తాజాగా వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లికి చెందిన ప్రశాంత్, రాఘవా చారిలు ఆకలి వేయడంతో ముషీరాబాద్ లోని అల్ సౌద్ ఏ వన్ మండి అరేబియన్ రెస్టారెంట్ లోకి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు.

కొన్ని నిమిషాల తర్వాత వచ్చిన బిర్యానీ ఆరగింపును ప్రారంభించగా, ఆ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో కంగుతిన్న ఈ బిర్యానీ ప్రియులు యజమానిని పిలిచి బిర్యానీలో బొద్దింక వచ్చింది, ఇదేంటని ప్రశ్నించగా చూసి చూడనట్లు వదిలేయాలి. ఈ బిర్యానీని పక్కకు తీసివేయండి మరో బిర్యాని ఇస్తామని  నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో  కంగుతిన్న వినియోగదారులు సమీప పోలీస్ స్టేషన్ కు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. ఈ విషయమై ఫుడ్ సేఫ్టీ అధికారులను ఫోన్ లో సంప్రదించగా అందుబాటు లోకి రాకపోవడం గమనార్హం.