11-09-2025 01:25:14 AM
మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్
పటాన్చెరు, సెప్టెంబర్ 10(విజయ క్రాంతి)అందరం కలిసి ముందుకు నడిస్తేనే భావిత రాల అభివృద్ధి సాధ్యపడుతుందని, మన జా తి యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలోకి రావాలంటే పార్టీలకతీతంగా ఏకమై అన్ని వర్గాలను కలుపుకొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
బుధవారం కరీం నగర్ పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి (టి ఎం పి ఎస్ ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ముదిరాజ్ జాతి హక్కుల సాధనకు టీ ఎంపీఎస్ పని చేస్తుందని అన్నారు,
ముదిరాజ్ జాతి మనగడం కోసం మన హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఉద్యమించాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పది నుంచి 15 మంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మన జాతి బిడ్డలు పోటీ చేసేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు తో మన ప్రధాన డిమాండ్ అయిన బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చే ప్రక్రియ ను ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో టి ఎం పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకరబోయిన మహేష్, మత్స్య సహకార సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కొలిపాక నరసయ్య,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూనంచుల మహేందర్, కొలిపాక శ్రీనివాస్, టీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి ఉప్పర వేణి రంజిత్, వర్కింగ్ ప్రెసిడెంట్ కాషబోయిన శేఖర్,కీసర సంపత్,జిల్లా మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్,
వైస్ చైర్మన్ కుమారస్వామి, సిరిసిల్ల అధ్యక్షులు చుక్కల రాము, సిద్దిపేట అధ్యక్షులు చెందు శ్రీనివాస్, టీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి జోగిని రవి, ఉపాధ్యక్షులు అట్టెం రమేష్, అశోక్, బోయిన దేవరాజు, కార్యదర్శి రవి, ప్రవీణ్, నరసింహులు, పండుగ స్వామి, వేలాదిగా పాల్గొన్న మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.