calender_icon.png 6 December, 2024 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలికి వెచ్చటి నేస్తాలు!

07-11-2024 12:00:00 AM

చలికాలంలో సాధారణంగా బద్దకం పెరుగుతుంది. ఉదయం లేవడానికి మొగ్గు చూపరు. దీంతో సహజంగానే వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపించరు. ఒకవేళ వ్యాయామం చేసినా తెలిసో.. తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. చలికాలంలో జాగింగ్, వాకింగ్ చేసే సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆ జాగ్రత్తలు ఇవి.. 

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. వ్యాయామం వల్ల మాత్రమే శరీరంలో వేడి పుడుతుంది. ఇదే చలి నుంచి శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. కాబట్టి చలిగా ఉందని భయంతో బయటకు వెళ్లకుండా ఉంటే ఉపయోగం ఉండదు. వెచ్చదనాన్ని పొందాలంటే వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల చలి తీవ్రత అంతగా తెలియదు.

చలికాలంలో వీచే గాలుల వల్ల శరీరంలోని కండరాలు బిగుసుకుపోయినట్లుగా తయారవుతాయి. దీంతో వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. కాబట్టి ముందుగా వార్మప్ చేసి జాగింగ్ ప్రక్రియను మొదలు పెట్టండి. ఇలా చేస్తే కండరాలు మామూలు స్థితిలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వాకింగ్, జాగింగ్ కంటే ముందు వార్మప్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  

తేమ శాతం

చలికాలంలో చర్మం తేమను కోల్పోవడం, మూత్రం రూపంలో ఎక్కువగా నీరు బయటకు వెళ్లిపోవడం.. వంటి కారణాల వల్ల శరీరంలో తేమ శాతం తగ్గిపోతుంది. కాబట్టి దాహం వేయకపోయినా నీరు, తాజా పండ్ల రసాలు.. వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీనివల్ల కోల్పోయిన తేమను తిరిగి పొందవచ్చు. 

స్వెటర్లు, సాక్సులు, గ్లౌజులు!

చలికాలంలో వ్యాయామం చేయడం ఎంత ముఖమో.. చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందులో భాగంగా స్వెటర్లు, చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్సులు ధరించి షూస్ వేసుకోవడం వంటివి చేయాలి. అలాగే తకు క్యాప్ పెట్టుకోవాలి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే చలి నుంచి చర్మానికి ఎలాంటి హానీ కలగదు. లేదంటే చలికి చర్మం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. 

గాలివీచే దిశగా.. 

జాగింగ్ చేసేటప్పుడు ఒక విషయాన్ని గమనించుకోవాలి. గాలి ఏ దిశగా వీస్తుందనేది ముందు గమనించి.. గాలి వీచే దిశగా వ్యాయామం చేయాలి. దీనివల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉండదు. 

సిల్క్ దుస్తులు బెటర్!

ఏ కాలమైనా వ్యాయామం చేసే క్రమంలో చెమటలు పట్టడం సహజం. చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు కాటన్ దుస్తు లు వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కాటన్ చెమటను పీల్చుకోవడం వ ల్ల దుస్తులు తడిగా అయిపోయి శరీరానికి మరింత చల్లగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ కాలంలో గాలికి త్వరగా ఆరిపోయే సిల్క్ దుస్తులు వేసుకోవడం మంచిది.

అలాగే వ్యాయామం పూర్తయిన తర్వాత దుస్తుల్ని వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే తడిగా ఉండే దుస్తుల వల్ల శరీరంలోని వేడి క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం వెచ్చదనాన్ని కోల్పోతుంది. అందుకే తడిగా ఉండే దుస్తుల్ని వెంటనే మార్చుకొని పొడిగా ఉండే వాటిని ధరించడం మంచిది. 

ఒంటరిగా వొద్దు..

చలికాలంలో చలికి వ్యాయామం చేయాలనిపించదు.. కానీ చేయక తప్పదు.. అయితే ఇలాంటప్పుడు ఒక్కరే ఒంటరిగా వ్యాయామం చేసేకంటే మీకు తోడుగా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు.. ఎవరినైనా తోడుగా తీసుకెళ్లండి. అలా తోడు ఉండటం వల్ల వ్యాయామం చేయడానికి కాస్త శ్రద్ధ చూపిస్తారు. దీంతో బోర్ కొట్టకుండా రోజూ హ్యాపీగా వ్యాయామం చేసుకోవచ్చు. 

అనిత అత్యాల,

అనిత యోగ అకాడమీ

6309800109