calender_icon.png 30 January, 2026 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్ప్‌లైన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అభిలాష

30-01-2026 01:49:45 AM

నిర్మల్, జనవరి ౨౯ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం హెల్ప్ లైన్ డెస్క్‌లను అందుబాటులో ఉంచిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం ఆయా మున్సిపాలిటీలో హెల్ప్ లైన్  కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ పొందుపరిచిన సమాచారం సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులు ఉన్నారు. అలాగే నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను గురువారం జిల్లా సాధారణ పరిశీలకులు వీరారెడ్డి తనిఖీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కౌంటర్ల వద్దకు వెళ్ళిన ఆయన నామినేషన్ ప్రక్రియపై ఆరా తీశారు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు.