30-01-2026 01:48:30 AM
అధికారులతో కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్‌తో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల సభ్యులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణలో ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. శిక్షణ అనంతరం బృందా ల కోసం కేటాయించిన వాహనాలను కలెక్టర్, సాధారణ పరిశీలకులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి తనిఖీని వీడియో రికార్డు చేయడంతో పాటు నిబంధనల ప్రకారం రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలా దేవి, రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.