calender_icon.png 24 August, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురవరం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు..

23-08-2025 07:41:55 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్..

మంచిర్యాల (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ(CPI) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో మరణించడం పార్టీకి తీరని లోటని, పోరాట స్ఫూర్తినిచ్చిన గొప్ప నాయకుడని, మేధావిని దేశం కోల్పోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాస్, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలీందర్ అలీఖాన్, బీమనాథుని సుదర్శన్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, మిర్యాల రాజేశ్వరరావు, కొట్టే కిషన్ రావు, పార్టీ ప్రజాసంఘాల నాయకులు గొలి శంకర్, సందిప్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.