23-08-2025 11:34:04 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల నుండి కాపాడేందుకు ఫోక్సో చట్టం రక్షణ కవచంలాగా పనిచేస్తుందని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
పోక్సో చట్టం 18 ఏళ్లలోపు పిల్లల రక్షణకు పని చేస్తుందని మైనర్ బాలికలపై లైంగిక దాడులు చేసినవారికి కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరికి ఈ చట్టాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ నసీం సుల్తానా సెప్టెంబర్‌లో జరగబోయే నేషనల్ లోక్ అదాలత్ గురించి వివరించారు. సాధ్యమైనన్ని కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.