24-08-2025 12:10:31 AM
ఉప్పల్, ఆగస్టు 23 : ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ కార్పొరేటర్ కమిష న్లు తీసుకొని కబ్జాదారులకు సహకరిస్తున్నారని గోకుల్ నగర్ నివాసి కాంట్రాక్టర్ రవీం ద్ర సాగర్ ఆరోపించారు. మల్లాపూర్ గోకు ల్ నగర్‌లో కొందరు కబ్జాలకు పాల్పడుతూ నకిలీ పత్రాలు సృష్టించి స్థలాలను అమ్మకాలు చేపట్టి ప్రజలను మోసం చేస్తున్నారని వీరికి స్థానిక కార్పొరేటర్ సహకరి స్తూ కమిషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
మల్లాపూర్ గోకుల్ నగర్‌లో 1968 లో 34 ఎకరాలలో 48 ప్లాట్ లతో లేఔట్ చేయడం జరిగిందన్నారు. చాలామంది ప్రజలు ఆ ప్లాన్ అప్పుడే కొనుగోలు చేయ డం జరిగిందన్నారు. ఆన్లైన్ లేకపోవడం గమనించిన స్థానికన్నంగా ఉండే వ్యక్తులు ఈ ప్లాట్‌లపై కన్ను వేసి నకిలీ దస్తావేజులు సృష్టించి ప్లాట్లను విక్రయిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు రవీంద్ర సాగర్ పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఆవుల చందు అనే వ్యక్తి రెండు కోట్ల రూపాయలు పెట్టి ప్లాట్‌ను కొనుగోలు చేయగా ఆ ప్లాటు ను నకిలీ జిపిఏ సృష్టించి కబ్జాదారులు మరొకరికి అమ్మకాలు చేపట్టారని అత ను స్థానిక పోలీస్ స్టేషన్ మరియు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. స్థానిక కార్పొరేటర్ సహకరిస్తూ కబ్జాదారులకు వతాసు పలుకుతూ ఆవుల చందును ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాధితుడు ఆవుల చందు శ్రీనివాస్ సింగిశెట్టి బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
రవీంద్ర సాగర్ ఆరోపణలో వాస్తవం లేదు: కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి
గోకుల్ నగర్ కాలనీ సంబంధించి ఏవైతే చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి అన్నా రు. కబ్జాలు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్లాక్మెయిలింగ్ పాల్పడే వ్యక్తి రవీంద్ర సాగర్ అని అలాంటి పనులు చేయడం మాకు రాదని దేవేందర్ రెడ్డి అన్నారు.
అసైన్ ల్యాండ్ కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించింది రవీంద్ర సాగరేనని దీనిని వ్యతిరేకించినందుకే బిజెపి పార్టీలోకి వెళ్లి టిఆర్‌ఎస్ పార్టీ నేతగా ఉన్న నన్ను విమర్శించడం సరికాదన్నారు. ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని మాట్లాడారన్నారు. తనపై చేసిన ఆరోపణలకు న్యాయపరమైన చర్యలు తీసుకుం టానని ఆయన పేర్కొన్నారు.