calender_icon.png 24 August, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు

23-08-2025 11:38:48 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అధిక ధరకు నడిరోడ్డుపై యూరియాను విక్రయించిన దుకాణాదారుడితో పాటు యూరియా పేరుతో ఓల్డ్ స్టాక్ పురుగుమందులను బలవంతంగా రైతులకు అంటగడుతున్న ఫర్టిలైజర్ దుకాణాదారులపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయక్రాంతి వార్తా పత్రికలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని అరుణోదయ ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేసి అందులోని రికార్డులను పరిశీలించారు.

రికార్డుల్లో నమోదు చేయకుండానే అత్యధిక ధరకు యూరియాను నడిరోడ్డుపై లారీల్లో పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు 15 రోజులపాటు ఎలాంటి లావాదేవీలు జరపొద్దని సీజ్ చేశారు. పట్టణంలోని నాగార్జున ఫర్టిలైజర్స్ దుకాణ గారు అధిక ధరకు విక్రయించడంతోపాటు ఓల్డ్ స్టాక్ పురుగుల మందులు బలవంతంగా రైతులకు అంటగడుతుండడంతో విజయ క్రాంతి వెలుగులోకి తెచ్చిన కథనానికి ఆయన స్పందించారు షోకస్ నోటీసులను జారీ చేస్తూ వివరణ ఇవ్వాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమార్చనకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు.