09-01-2026 04:05:04 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల తీరును శుక్రవారం దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల తీరును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, ఉపయోగిస్తున్న నిర్మాణ సామగ్రి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులు, సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే లబ్ధిదారులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పిడి హౌసింగ్ విజయపాల్ రెడ్డి, ఎమ్మార్వో సుధాకర్, , ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ నర్సయ్య, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.