09-01-2026 04:07:45 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): గత వారం రోజులుగా తాము తాగు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని దర్గా కాలనీకి చెందిన ముస్లిం మహిళలు ఖాళీ బిందెలతో వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు వెంటనే త్రాగునీరు అందించాలంటూ మహిళలు అధికారులను కోరారు.
మహిళలతోపాటు, ఆ కాలనీకి చెందిన కొంతమంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తు పనుల దృశ్య పైప్ లైను ధ్వంసం అయిందని, రేపటినుండి తాగునీరు అందించి సమస్య పరిష్కారం కు కృషి చేస్తామని కమిషనర్ చెప్పడంతో మహిళలు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు.