09-01-2026 03:59:11 PM
రైతు బంధు లేదు.. పండిన వడ్ల పంటలకు బోనస్ లేదు
ఈ నెల 18 వ తేదీలో రైతు బంధు వేయాలి
రైతు బంధు ఇవ్వకుంటే కలెక్టర్ కార్యాలయంను ముట్టడిస్తాం
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): రైతుల సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో రైతుల సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ, ఎంతో కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు రైతు సమస్యలపై ధర్నా చేపట్టారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలకు ప్రజా ప్రభుత్వ పాలనలో ఎటువంటి ఆటంకం తలెత్తకుండా రైతులకు కేసీఆర్ కంటే ఎక్కువ రైతుబంధు పదివేలకు బదులు రూ.15 వేలు రైతుబంధు వేస్తానని అలాగే మహాలక్ష్మి పథకము కొత్త పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలు ఎన్నో మాటలు చెప్పి నీరుగారిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రజలు బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొన్న కురిసిన భారీ వర్షాలకు 8 మండలాల్లో సుమారు 8 ఎకరాల భూమిలో ఇసుకమేటలు పేరాయని అక్కడక్కడ రహదారులు కొట్టుకపోయారని ఎల్లారెడ్డి మండలానికి దగ్గరలో ఉన్న లింగంపేట్ మండలంలో లింగంపల్లి వద్ద కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వంతెన దెబ్బతినడంతో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇప్పటివరకు ఆ వంతెన నిర్మాణం కూడా చేపట్టని దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని పేపర్ మీద ప్లెక్సీల మీద ఫోటోలు పెట్టి ఫోజులు కొట్టడం కాదు నిన్న జరిగిన నాగిరెడ్డిపేట మండలంలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు భోజనం పట్ల అస్వస్థత గురై ఇబ్బందులు పడ్డ విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోనీ ఎమ్మెల్యే, శుక్రవారం కస్తూర్బా గాంధీ పాఠశాలలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీరు కలుషితంలో పిల్లలు ఎంతో అవస్థలు పడుతున్నారని కనీసం విద్యావ్యవస్థ పట్ల కూడా మమకారం చూపని స్థానిక ఎమ్మెల్యే ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ బ్యాంకుకు 100 కోట్ల రూపాయల అప్పు అడగడానికి పోయిన ఎమ్మెల్యే కనీసం 400 మీటర్ల దూరం ఒక బ్రిడ్జిని నిర్మాణం చేయలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ, పాలనలో ఎల్లారెడ్డిలో ఆరు కోట్ల రూపాయలతో అధునాతన నూతన,ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం ఐదు కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి బస్టాండ్ భవనం ఎల్లారెడ్డిలో 200 ఇండ్లు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గల్లీకి సిసి రోడ్డు నిర్మాణం ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో ప్రతి కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం బిఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగిందని, నేడు ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మాణం అవుతున్న ట్యాంక్ బండ్ కూడా బిఆర్ఎస్ పార్టీ పాలనలోనే మంజూర అయిందని, ఫోటోలు పెట్టుకుని చెప్పుకోవడం సిగ్గుగా లేదా అని మండిపడ్డారు. పట్టణంలో పలు పాఠశాలల్లో విద్యార్థులకు రక్షిత మంచినీరు కూడా కరువైంది గ్రామాలలో నీరు సరిగ్గా రాకపోవడం బురద నీరు రావడం ఏమిటని హెచ్చరించారు.
ఈనెల 18వ తారీకు వరకు రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ చేయకుంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకిస్తామని జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అనుభవం ముఖ్యమంత్రి కి ఏం లేదని మండిపడ్డారు. శాసనసభకు ఎన్నికై రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పట్టణంలో ఒక ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన పాపానపోని ఎమ్మెల్యే అంటే అమెరికా లేదంటే అమెరికాకు వెళ్లి తన పనులు చేసుకోవడం అక్కడి నుంచే పరిపాలన కొనసాగించే ఎమ్మెల్యేను చూసి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న వస్త్ర వ్యాపారులకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు వల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందని ఉచిత బస్సు రావడంతో మహిళలు కామారెడ్డి ఇతరేతర ప్రాంతాలకు వెళ్లి వస్త్రాలు కొనుగోలు చేయడం పట్ల ఎల్లారెడ్డి పట్టణం వెనుకబడిపోతుందని వస్త్ర వ్యాపారులు వెలబోసుకుంటున్నారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల పాపం కుటుంబం గడుపుకోవడానికి తెచ్చుకున్న మూడు చక్రాల వాహనం ఆటో యజమాని కూడా అవస్థలు తప్పడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ ఒక్క పథకం చేసిందేమీ లేదని ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని రానున్న రోజుల్లో తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రజలకు కేసీఆర్ పెద్ద తండ్రిగా ఉంటాడని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతుల సమస్యలపై చేపట్టిన ధర్నాలు అన్నారు. అనంతరం ఎల్లారెడ్డి హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ ఎల్లారెడ్డి మాజీ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు ఏగుల నర్సింలు, మతమాల ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తాడ్వాయి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కపిల్ రెడ్డి, లింగంపేట్ మాజీ ఎంపీపీ సాయిలు ముదాం, గాంధారి మండల అధ్యక్షుడు మాజీ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు సత్యం తానాజీ రావు శివాజీ రావు, ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట్ మండలాల అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.