calender_icon.png 31 August, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

30-08-2025 06:09:21 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గు గుడిసె తుంకిపల్లి గ్రామంలో వరద  ముంపు ప్రాంతాలను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. పంట ఆస్తి నష్టం వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి  పంపాలని ఆయన అధికారులకు సూచించారు. బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద వరద పరిస్థితులు, ముంపు బాధితులను పరామర్శించారు. తుంకిపల్లి గ్రామం జలదిగ్బంధానికి గురవుతుందని స్థానికులు కలెక్టర్,  దృష్టికి తీసుకు వెళ్లారు.