calender_icon.png 30 August, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పంపిణీపై మొండివైఖరి వీడాలి

30-08-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): యూరియా పంపిణి పై తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష వైఖరి చూపుతోందని, మొండి వైఖరి వీడి తక్షణం రాష్ట్రానికి అవసరమైన యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ యూరియా వచ్చేది ఎప్పుడు, రైతు కష్టం తీరేది ఎప్పుడు, దేశంలో ఏ రాష్ట్రంపై లేని వివక్షత తెలంగాణపై ఎందుకు, రైతు పండించిన ఆహారం అందరికీ కావాలి, ఆ రైతు కష్టం మాత్రం ఎవరికీ పట్టదు, ఎండ వాన, రాత్రి పగలు తేడా లేకుండా నష్టమని తెలిసినా భూమినే నమ్ముకుని బతుకుతున్న రైతు దేశ ఆహార భద్రతకు మూల స్తంభమైన కర్షకుల బ్రతుకు మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు.   రైతు సంఘం జిల్లా అధ్యక్షుల గునిగంటి రాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు నల్లపు సుధాకర్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజారావు, కోటయ్య, భూక్యా లాలు, గుగులోతు వీరన్న పాల్గొన్నారు.