calender_icon.png 30 August, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నచెరువు అలుగుకు గండి ఇబ్బందుల్లో రైతులు

30-08-2025 12:00:00 AM

తాడ్వాయి, ఆగష్టు, 29( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని దేమి కలాన్ చిన్న చెరువు అలుగుకు గండి పడింది దీంతో చెరువులోని నీరంతా వృధాగా బయటకు వెళ్ళిపోతుంది చెరువు అలుగుకు పడిన గండి నుంచి వస్తున్న నీటి తాకిడికి చెరువు కిందనే ఉన్న ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ నేల కూలింది.

చెరువు పక్కనే ఉన్న కాటిపల్లి కరుణాకర్ రెడ్డి అనే రైతు పంట పొలాల్లోకి నీళ్లు చేరడంతో పంటకు తీవ్ర నష్టం వాటిళ్ళింది. చెరువు అలుగుకు మరమ్మతులు చేయాలని గతంలో చాలా పర్యాయాలు నీటిపారుదల శాఖ అధికారులకు విన్నవించామని రైతులు తెలిపారు. కానీ సదరు అధికారులు సకాలంలో పట్టించుకోకపోవడంతో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువు అలుగు కు గండి పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.