calender_icon.png 10 January, 2026 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

09-01-2026 03:50:36 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు జిల్లా కలెక్టర్‌ను బొకే అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు. విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యాలయంలో అన్ని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు సరిగా ఉన్నాయా, భోజనం నాణ్యత ఎలా ఉందని, టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయా, వాటిలో రన్నింగ్ వాటర్ వస్తున్నదా, త్రాగునీటి సమస్య ఏమైనా ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మొక్కలు నాటి కేజీబీవీ ఆవరణలో నిర్మిస్తున్న పెండింగ్‌లో ఉన్న సంపు నిర్మాణ పనులను పరిశీలించి ఆరా తీశారు. సంపు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం స్టోరేజ్ ని పరిశీలించి సరకుల నిల్వలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. రిజిస్టర్ లను పరిశీలించి రిజిస్టర్ లో ఉన్న నిల్వలను స్టోరేజీలో ఉన్న నిల్వల వివరాలను ఆరా తీసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆన్నారు. ఈ సందర్శనలో  ప్రిన్సిపల్ మంగమ్మ , ఎంఈఓ విజయ్ కుమార్, ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ భానుశ్రీ, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.