19-08-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చికిత్స పొందుతున్న పేషెంట్లతో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, విష జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా వైద్య సేవలు అందించాలని, ప్రధాన ఆస్పత్రిలోని పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పేషెంట్లకు డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.
ఆస్పత్రిలో అత్యవసర సేవలతో పాటు కావలసిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, డిఐసిఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ ఉన్నారు.