19-08-2025 12:00:00 AM
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అందించిన 185 వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతూ వినతులను అందజేశారు.
ప్రజావాణి వినతులను పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, డిఆర్డిఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, తదితర శాఖల అధికారులు, పాల్గొన్నారు.