02-07-2025 12:00:00 AM
సూర్యాపేట, జూలై 1 (విజయక్రాంతి) : పట్టణంలోని యాదాద్రి టౌన్ షిప్ వద్ద నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను పంచాయతీరాజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి భవన్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి యొక్క కార్యకలాపాలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని వారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్, ఉత్పత్తుల ప్రదర్శన ,మేళాలు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు. ఈయన వెంట డి ఆర్ డి ఓ వివి అప్పారావు, పంచాయతీరాజ్ డిఇ మనోహర్ ఉన్నారు.