02-07-2025 04:57:28 PM
మంచిర్యాల (విజయక్రాంతి): శ్రీరాంపూర్ ఏరియాలో ఆరు నెలలకు ఒకసారి ఇవ్వవలసిన బూట్లు నాణ్యమైనవి ఇవ్వడం లేదని, వాటితో పాటు సాక్సులు ఇవ్వాల్సి ఉండగా అవి స్టాక్ లో లేవని, వస్తే ఇస్తామని చెబుతూ దాటవేయడం సరైన పద్ధతి కాదని సిఐటియు(CITU) శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ విమర్శించారు. గత ఎన్నికల్లో బాట కంపెనీ బూట్లు ఇప్పిస్తామని చెప్పిన గుర్తింపు సంఘం ఇప్పటివరకు ఇప్పించలేదని, గనులపై ఏరియా స్థాయిలో జరుగుతున్న స్ట్రక్చర్ మీటింగ్ లోను యాజమాన్యంను అడుగుతున్నామని చెప్పడమే తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా కార్మికులకు నాణ్యమైన బూట్లు, సాక్సులు, చేతి గ్లౌజులు ఇప్పించాలని, లేదంటే భవిష్యత్తులో గుర్తింపు సంఘంకు బంగపాటు తప్పదని విమర్శించారు.