calender_icon.png 3 July, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతల సహకారంతో పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

02-07-2025 04:53:34 PM

సదాశివపేట: సదాశివపేట మండలం(Sadasivpet Mandal)లోని నందికంది ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థిని, విద్యార్థులకు గ్రామ మాజీ ఎంపీటీసీ జయశ్రీ-శ్రీనివాస్ లు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్(Mandal Education Officer N. Shankar) తెలిపారు. పాఠశాలలో ముందుగా వనమహోత్సవం భాగంగా మొక్కలు నాటడం జరిగిందని, అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్కూలు బ్యాగులు అందించి, విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందించిన జయశ్రీ శ్రీనివాస్ లకు ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఇదేవిధంగా మండలంలోని గ్రామాల వారీగా ప్రభుత్వ పాఠశాలల చదివే పేద విద్యార్థులకు సహాకారం అందించిడానికి దాతలు ముందుకు రావాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్.ఎం వినయకుమార్, ఏఏపిసి చైర్ పర్సన్ హంసమ్మ, హెచ్.ఎం బసవయ్య, సిఆర్పిలు ఝాన్సీరాణి, రాజేశ్వర్, టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.