calender_icon.png 19 August, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్

18-08-2025 12:05:14 AM

పాపన్నపేట, ఆగస్టు 17 : మెదక్ జిల్లా కలెక్టర్  క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆదివారం పాపన్నపేట మండలం ఎల్లాపూర్  బ్రిడ్జి వరద ప్రవాహాన్ని పరిశీలించారు.  సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడం జరిగిందని,  ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేసిన పక్షంలో వరద ఉధృతి తాకిడి ఉంటుందని ఆర్‌అండ్ బి అధికారులు కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు వరదల వలన రైతులకు గాని సామాన్య ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని,  నీటిమట్టాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు.