calender_icon.png 18 August, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్ననాటి స్నేహితులతో గడిపిన మంత్రి పొంగులేటి

18-08-2025 12:04:17 AM

ఖమ్మం, ఆగస్ట్ 17 (విజయ క్రాంతి):  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన స్నేహితుడి కుమారుడి వివాహానికి ఆదివారం ఖమ్మం నగరంలోని  హాజరయ్యారు. ఈ వేడుకలో తన చిన్ననాటి స్నేహితులు, విద్యార్థి దశలో కలసి చదువుకున్న మిత్రులను మంత్రి పొంగులేటి కలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారి స్నేహితులు విద్యార్థి దశలో జరిగిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసి అందరూ కొద్దిసేపు ఆనందంగా గడిపారు. తన స్నేహితుడు జిల్లా మంత్రి కావడం తమకే ఎంతో ఆనందంగా ఉందని ఇంకా పెద్దపెద్ద పదవులు అధిరోహించాలని మంత్రి స్నేహితులుకోరారు.