18-08-2025 11:49:48 PM
కుబీర్: ఈనెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాబోధనపై నిర్వహించి జాతీయ కార్యశాల బ్యాగరీ ఎల్లన్న అనే ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. బైంసా మండలంలోని వానల్పాడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎల్లన్న పిల్లల్లో విద్య నైపుణ్యం బొమ్మలు ఆటపాటలతో కూడిన విద్య అనే అంశంపై కార్యశాల శిక్షకుడిగా ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం పదిమంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా నిర్మల్ జిల్లాకు చెందిన ఎల్లన్న ఎంపిక కావడం పట్ల విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.