18-08-2025 11:58:15 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్ మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులను మూసి వేసినట్లు సిఐ వెంకట్ రెడ్డి తెలిపారు. వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నందున, ముందు జాగ్రత్త చర్యగా కల్హేర్ నుండి పిట్లం, మీర్ఖాన్పేట్, వాసర్ నుండి కంట్టి, రాసోల్ నుండి కంట్టి, జంగి(కే) నుండి కంట్టి, వంగ్డాల్ నుండి గైరాన్ తండా, తడ్కల్ నుండి దొంగ బాన్సవాడ రోడ్లను మూసివేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నా