calender_icon.png 30 January, 2026 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

30-01-2026 01:44:20 AM

మంచిర్యాల, జనవరి 29 (విజయక్రాంతి): జిల్లా లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.అన్వేష్, కలెక్టరేట్ ఏఓ పిన్న రాజేశ్వర్‌లతో, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎంపీడీవో సరోజలతో కలిసి సందర్శించి నామినేషన్ల ప్రక్రియ తీరును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.