30-01-2026 01:42:55 AM
ఎమ్మెల్యే పాయల్ సమక్షంలో మాజీ కౌన్సిలర్ బీజేపీలో చేరిక...
ఆదిలాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సి పాలిటీలో గత పాలకులు కమిషన్ లకు కక్కుర్తి పడి మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యే సమక్షంలో మాజీ కౌన్సిలర్ అందె శ్రీదేవి తన వార్డు యువకులు, మహిళలతో కలిసి బీజేపీ లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ ఖండవాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా మార్చేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారి పోషన్న, తదితరులు పాల్గొన్నారు.